చంకలు తెల్ల బడాలంటే ఇలా చేయండి
నిత్యం ఎండలో తిరగడం, దుమ్ము, ధూళి, వేడి, ఎండ, చెమట…
ఇలా కారణాలు
ఏమున్నా శరీరంలోని కొన్ని కొన్ని బాగాలు నల్లగా ఉంటాయి.. ప్రధానంగా మోకాళ్లు, మోచేతులు, చంకల్లో
ఎక్కువగా నల్లగా అవుతుంది.
చాలామంది మహిళల్లో చంకలు, గజ్జలు నల్లగా ఉంటాయి. తరచూ షేవింగ్ చేయడం వల్ల, ఎక్కువ చెమట, సరైన గాలి వెలుతురు తగలకపోవటం , ఆల్కహాల్ బేస్డ్ డియోడ్రెంట్స్ వాడటం
వల్ల చంకలు నల్లబడతాయి. ఇలా అసహ్యంగా ఉండటంతో
స్లీవ్ లెస్ వేసుకోవడానికి ఇబ్బందిపడుతుంటారు. అయితే ఇంటి వైద్యంతోనే పలు సహజ సిద్ధమైన చిట్కాలను పాటించడం వల్ల
నల్లబడ్డ ఆయా భాగాలను తిరిగి సాధారణ స్థాయికి వచ్చేలా చేయవచ్చుచంకల్లోని ఈ నలుపును
తగ్గించుకోవచ్చు.
మొదటిది అలోవెరా జెల్…
ఎండ కారణంగా నలబడ్డ చర్మానికి తిరిగి పూర్వ స్థితిని
ఇవ్వడంలో అలోవెరా జెల్ (కలబంద గుజ్జు) బాగా ఉపయోగపడుతుంది. కొద్దిగా అలోవెరా జెల్‌ను
తీసుకుని నల్లబడ్డ ప్రదేశాలపై రాసి 20
నిమిషాల పాటు అలాగే ఉంచాలి. అనంతరం నీటితో కడిగేయాలి. రెగ్యులర్‌గా ఇలా చేస్తే
చక్కని ఫలితాలు వస్తాయి.
బేకింగ్ సోడా…
ఒక భాగం నీరు, 3 భాగాల బేకింగ్ సోడాను తీసుకుని మెత్తని పేస్ట్‌లా చేయాలి. మిశ్రమం స్మూత్‌గా
వచ్చే వరకు పేస్ట్‌ను బాగా కలపాలి. దీన్ని నల్లబడ్డ భాగాలపై రోజుకు రెండు సార్లు
రాస్తే ఫలితం ఉంటుంది.
నిమ్మకాయ…
చర్మానికి ప్రకాశాన్ని, మెరుపును కలిగించే గుణాలు నిమ్మలో అధికంగా
ఉన్నాయి. కొద్దిగా నిమ్మ రసాన్ని తీసుకుని నల్లబడ్డ ప్రదేశంలో రాయాలి. అనంతరం 15
నుంచి 20 నిమిషాల పాటు ఆగిన తరువాత కడిగేయాలి.
ఇలా చేస్తే చర్మం సహజ సిద్ధమైన మెరుపును సంతరించుకుంటుంది.
ఆలివ్‌ఆయిల్, చక్కెర…
పొడిగా ఉన్న చర్మం, మృత చర్మ కణాలను తొలగించడంలో చక్కెర
ఉపయోగపడితే చర్మాన్ని సంరక్షించడంలో ఆలివ్ ఆయిల్ బాగా పనిచేస్తుంది. కొద్దిగా
చక్కెర, ఆలివ్ ఆయిల్‌లను సమభాగాలుగా తీసుకుని రెండింటినీ
పేస్ట్‌లా వచ్చే వరకు బాగా కలపాలి. అనంతరం ఆ పేస్ట్‌ను శరీర భాగాలపై రాసి 5 నుంచి 10 నిమిషాలు ఆగాక కడిగేయాలి.
కీరదోస…
కీరదోసకాయ ముక్కలు కొన్ని, కొద్దిగా నిమ్మరసం, పసుపులను
కలిపి మిక్సీలో వేసి పట్టాలి. ఈ మిశ్రమాన్ని నల్లబడ్డ భాగాల్లో ఉంచితే తగిన ఫలితం
కనిపిస్తుంది.
పాలు…
పాలు, దాని
సంబంధ ఉత్పత్తుల్లో చర్మాన్ని సంరక్షించే గుణాలు అధికంగా ఉన్నాయి. కొద్దిగా పాలు,
పెరుగులను తీసుకుని మిశ్రమంగా కలిపి చర్మంపై రాయాలి. ఇది పొడి చర్మం
కలవారికి మేలు చేస్తుంది.
బాదం నూనె…
చర్మానికి పోషణను అందించే గుణాలు బాదం నూనెలో ఉన్నాయి.
రోజుకోసారి బాదం నూనెను కొద్దిగా తీసుకుని చర్మానికి రాస్తే తగిన ఫలితం ఉంటుంది.
చర్మానికి మెరుపును ఇచ్చే గుణం బాదం నూనెలో ఉంది.
ఆలుగడ్డలు…
కొద్దిగా నీటిని, కొన్ని
ఆలుగడ్డలను తీసుకుని మిక్సీ పట్టాలి. అనంతరం వచ్చే మిశ్రమాన్ని నల్లబడ్డ శరీర
భాగాలపై రాయాలి. కొద్దిసేపు ఆగాక కడిగేయాలి. ఇది మృత చర్మ కణాలను వేగంగా
తొలగిస్తుంది.
No comments:
Post a Comment